అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాల అమలు.
బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్.
రాజన్న సిరిసిల్ల( ప్రజాబలం ), మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సన్న బియ్యం పంపిణీ ని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తో కలిసి ప్రారంభించిన మంత్రి.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రధమమని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పథకాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న రేషన్ దుకాణంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు సన్నబియాన్ని మంత్రి, విప్, కలెక్టర్, ఎస్పీ తదితరులతో కలిసి పంపిణీ చేశారు.
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రారంభించారని గుర్తు చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17,263 రేషన్ దుకాణాలలో రెండు లక్షల 91 వేల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడు సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా వివిధ పథకాలు అమలు చేస్తుందని వివరించారు. దాదాపు 60 వేల ఉద్యోగాలను తమ ప్రభుత్వం భర్తీ చేసిందని గుర్తు చేశారు. మహిళల అందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నమని గుర్తు చేశారు. మహిళా మణులను కోటీశ్వరులుగా చేయాలని సదుద్దేశంతో ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి కింద వివిధ యూనిట్లు ప్రారంభించామని తెలిపారు. అలాగే సోలార్ యూనిట్లు మహిళా సంఘాలకు బస్సులు పంపిణీ చేస్తున్న మని వెల్లడించారు. సన్నధాన్యం పండించే రైతులకు క్వింటాల్కు అదనంగా 500 రూపాయలు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీకి నూతన బస్సులు అందజేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందజేస్తున్నమని వివరించారు.
జిల్లాలోని345 రేషన్ దుకాణాల ద్వారా… సన్న బియ్యం పంపిణీ.
రాష్ట్ర ప్రభుత్వం సోషియో ఎకనామిక్ సర్వే ను ఇటీవల నిర్వహించిందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ఆమోదించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని నేత కార్మికులకు భరోసా కల్పిస్తూ గత బకాయిలను విడుదల చేసిందని, అలాగే యార్న్ బ్యాంకు ను ప్రారంభించిందని వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. దాదాపు 20 వేల కోట్ల రూపాయల రైతుల రుణాలను ప్రభుత్వ మాఫీ చేసిందని వెల్లడించారు. త్వరలో పెన్షన్ పంపిణీ ఇతర కార్యక్రమాలను ప్రారంభించనున్నామని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని ప్రకటించారు. జిల్లాలోని345 రేషన్ దుకాణాల ద్వారా 1,70,000 రేషన్ కార్డుల లబ్ధిదారులకు 3275 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా లబ్ధిదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప, అదన కలెక్టర్ కిమ్యా నాయక్, సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, జిల్లా పౌరసరఫరాల అధికారి వసంతలక్ష్మి, పౌరసరఫరాల మేనేజర్ రజిత తదితరులు పాల్గొన్నారు.
