చరిత్రలో నిలిచిపోయే పథకం సన్నబియ్యం పంపిణీ పథకం

 

– పేదవాడి కడుపు నింపడానికెే సన్నబియ్యం పథకం
– సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ టాప్
హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్

హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 1

 

వరి వేస్తే ఉరి అని చెప్పిన మాటల నుండి పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టే స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో తీసుకువచ్చామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. మంగళవారం నాడు ఇల్లందకుంట మండల పరిధిలోని టేకుర్తి,రాచపల్లి,
సిరిసేడు గ్రామాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు ఉచిత సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయే విధంగా సన్నబియ్యం పథకాన్ని రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ వేదికగా ప్రారంభించారని ధనిక పేద తేడాలేకుండా ప్రతి రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారుడికి సన్న బియ్యాన్ని అందజేస్తామని అన్నారు.పేదల కోసం ఏ ప్రభుత్వం చేయని మంచి పనిని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రమే చేశామని అన్నారు.మన దగ్గర పండిన పంటను ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేయడం శుభసూచకమని,భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు.సన్న బియ్యం లాంటి పథకాన్ని అమలు చేసినందుకు సిఎం రేవంత్ రెడ్డి,సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హుజురాబాద్ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కార్యకర్త కుటుంబానికి పరామర్శ

ఇల్లందకుంట మండల పరిధిలోని సిరిసేడు గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త మర్రి తిరుపతి రెడ్డి ఇటీవల ప్రమాదవశాత్తూ మరణించగా వారి కుటుంబాన్ని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ పరామర్శించారు.ధైర్యంగా ఉండాలని,వారి కుటుంబానికి భరోసా కల్పించి అండగా ఉంటామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking