ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏప్రిల్ 1:
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ డి విజయేందర్ రెడ్డి, డి సి ఎస్ ఓ ఎల్ సుగుణ బాయ్,ఏసీ ఎస్ఓటి సంధ్యతో కలిసి ఉప్పల్ మరియు నాగోల్ లోని రేషన్ దుకాణాలను సందర్శించి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. సన్నబియ్యం సరఫరాకు సంబంధించి కార్డుదారులతో సంభాషించారు సన్న బియ్యం పంపిణీ పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. రామంతపూర్ ఎం ఎల్ ఎస్ పాయింటును కూడా సందర్శించి నిర్ణీత సమయంలో స్టేజ్ కదలికను వేగవంతం చేయాలని ఎం ఎల్ ఎస్ పాయింట్ ఇన్చార్జిని ఆదేశించారు.
