తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ పథకం దేశానికి ఆదర్శం

 

కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 01: మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని పాత మంచిర్యాల రేషన్ షాప్ వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. మంగళవారం ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ…రాష్ట్రంలోని ప్రతి పేదవారి ఇంటికి సన్నబియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని.పేదవారికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించామాని.ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకం అని,పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రతి పేదవారి ఇంట ప్రతిరోజూ పండుగ జరగాలన్న ఆలోచనతో,పేద వారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు,నాయకులు కార్యకర్తలు,పాత మంచిర్యాల ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking