జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మే 9:
పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని మల్కాజిగిరి జిల్లా రిటర్నింగ్ అధికారి,
జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు.
గురువారం కలెక్టరేట్ వి సీ హాల్ లో ఎన్నికల పై మల్కాజిగిరి, మేడ్చల్ ,కుత్బుల్లాపూర్,కూకట్పల్లి,ఉప్పల్ , ఏఆర్వోలకు తగిన సలహాలు,సూచనలు చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సజవుగా, పారదర్శకంగా జరిగేలా ఏ ఆర్ ఓలు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికలు కూడా క్రితంలో విధులు నిర్వహించిన విధంగా అదే స్ఫూర్తితో పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని అన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి సెగ్మెంట్ లో ఓటర్ స్లీప్ లను 100% పంపిణీ జరిగేలా చూడాలని, పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతి సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు., ఏ ఆర్ ఓ లు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిశీలించాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ఎలాంటి అసౌకర్య కలగకుండా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య,ఏ ఆర్ ఓ లు పాల్గొన్నారు.