ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మే 9:
బిజెపి అధికారం లోకి రావడం ఖాయం అని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి అన్నారు. నాచారం డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో మల్కాజ్గిరి లో పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ మద్దతుగా మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి, బూత్ కో ఆర్డినేటర్ పోతగాని గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల్ మాజీ శాసన సభ్యులు బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని మరోసారి మోదీ రాగానే అవుతాడని అన్నారు. రాష్ట్రం లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను, గ్యారెంటీలను అమలు చేయలేదన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆయన అన్నారు. మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు వివరించారు. బిజెపితోనే అభివృద్ధి సాధ్యమని, బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. పద్మారెడ్డి, రవీందర్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు మల్కా ప్రకాష్,మోహన్ రెడ్డి, బూత్ కో ఆర్డినేటర్ లు యోగేశ్వర్ రెడ్డి, గోపి, బూత్ అధ్యక్షులు క్రాంతి కుమార్, వెంకట్ నాయక్, అనిత రెడ్డి, మంజుల వాణి, కాలనీ వాసులు, స్థానికులు, బిజెపి అభిమానులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.