జనరల్ అబ్జర్వర్ డాక్టర్ ఎం.ఎస్.ప్రియాంక శుక్లా,జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మే 9:
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ఎన్నికల నియమ నిబంధనలను అనుసరించి జిల్లాలో నోడల్ అధికార్లకు,పోలీస్ అధికారులు తమరికి కేటాయించిన విధులను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల విధులు ప్రశాంతంగా నిర్వహించాలని జనరల్ అబ్జర్వర్ డాక్టర్ ఎం.ఎస్.ప్రియాంక శుక్లా అన్నారు.
గురువారం రోజున కలెక్టరేట్ లోని వి సి హాల్ లో జరిగిన సమావేశంలో పోలీస్ అబ్జర్వర్ డాక్టర్ రామేశ్వర్ సింగ్, వయ్యపరిశీలకులు మనోజ్ అలోయిస్ లక్రా, దృవ్ భోళా,జిల్లా ఎన్నికల అధికారి, గౌతమ్ , పోలీస్ అధికారులు, ఏ ఆర్ ఓ లు, నోడల్ అధికారులు ఈ సమావేశం పాల్గొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం లో 72 గంటల కంటే ముందు పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు, ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఎస్ ఎస్ టి , ఎఫ్ ఎస్ టి , వి ఎస్ టి , అకౌంటింగ్ టీం, ఎం ఎం సి , ఎక్స్సైజ్ సభ్యులు సమర్ధవంతంగా భాద్యతలు నిర్వహించాలని జనరల్ అబ్జర్వర్ ప్రియాంక శుక్లా అన్నారు. పోలింగ్ స్టేషన్ రూట్ లలో ఎన్నికల నిర్వహణ సామాగ్రిని సంబంధిత సెక్టోరియల్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా మెటీరియల్ పంపిణీ చేయాలన్నారు .ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలన్నారు. బి ఎల్ ఓ లు ఓటరు స్లిప్పులను 100% పంపిణీ చేసే లా చూడాలన్నారు.వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన మెడికల్ కిట్స్ అందుబాటులో ఉంచాలన్నారు. చల్లటి త్రాగునీరు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, 108 అంబులెన్స్, అందుబాటులో ఉంచాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో షామియానాలు, కుర్చీలు, చల్లటి మంచినీరు, టెయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.ప్రతి పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపు ,వీల్ చైర్ లు ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.100 మీటర్ల దూరం లైన్ మార్క్ ఉండాలన్నారు. పోలింగ్ రోజు ఉదయం ఐదు గంటలకు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించాలన్నారు. సెల్ ఫోన్లు అనుమతించడం జరగదని తెలిపారు.
పోలీస్ అబ్జర్వర్ రామేశ్వర్ సింగ్ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, ఎన్నికల అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు. లా అండ్ ఆర్డర్ అదుపులో పెట్టే బాధ్యత పోలీస్ యంత్రాంగం పై ఉందని అన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటుచేసిన చెక్ పోస్టులు ఎన్నికలు పూర్తయ్యే వరకు కొనసాగుతాయని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉండాలన్నారు.
వయ్య పరిశీలకులు మనోజ్ అలాయిస్ లక్రా మాట్లాడుతూ జిల్లాలో ప్రతిష్టమైన నిఘా ఏర్పాటు చేసి అక్రమంగా తరలించే మద్యం ,నగదు పై అధికారులు దృష్టి కేంద్రీకరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అభిలాష్ అభినవ్, డి సీ పి,నిఖిత పంత్, డి సీ పి పద్మ, అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, విజేందర్ రెడ్డి, డి ఆర్ ఓ హరిప్రియ, ఏ ఆర్ ఓ లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.