బీజేపీ ఇంచార్జీ కేతిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి
పలు గ్రామాల్లో ప్రచారం
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 09 : కేంద్రంలో బీజేపీని గెలిపించాలని బీజేపీ ఇంచార్జీ కేతిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి ప్రజలను కోరారు.గురువారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని అంతేకాకుండా పెద్దపల్లి పార్లమెంట్ బిజేపి పార్టీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ను ను భారీ మెజార్టీతో గెలిపించాలని పలు గ్రామాలు దౌడేపల్లి,పాత కొమ్ముగూడెం,కొత్త కొమ్మ గూడెం గ్రామాల్లో ఉపాధి హామీ కార్మికులను కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు.బీజేపీ మండల అధ్యక్షుడు బొప్పు కిషన్ తో కలిసి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.బీజేపీ చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అయన వెంట స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.