మృతుడి కుటుంబానికి రూ. 80వేలు ఆర్థిక సహాయం అందజేసిన మిత్రులు

 

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణానికి చెందిన రేపల్లె వెంకటేష్ (40) తన కుటుంబంతో కలిసి కూరగాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత రెండు నెలల క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో వెంకటేష్ కుటుంబ సభ్యులు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. వెంకటేష్ కు పదవ తరగతి, ఎనిమిదవ తరగతి చదువుతున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.‌ ఈ క్రమంలో 1997- 98 ఎస్.ఎస్.సి బ్యాచ్ విద్యార్థులు వెంకటేష్ కుటుంబానికి అండగా నిలిచారు. వెంకటేష్ పూర్వ మిత్రులందరూ తలా రూ.5 వేల చొప్పున సేకరించి మొత్తం రూ.80 నగదును జమ చేశారు. ఈ మొత్తాన్ని వెంకటేష్ కుమార్తె రేపల్లె సిరివెన్నెల పేరుమీద పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ డిపాజిట్ చేశారు. మంగళవారం ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా పాస్ పుస్తకాన్ని వెంకటేష్ భార్య, పిల్లలకు అందజేశారు. వీటితోపాటు 50 కేజీల బియ్యం నిత్యవసర సరుకులను కూడా అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు బద్దం కిరణ్ పటేల్, సర్గల నర్సింలు మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవడంతో పాటు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వెంకటేష్ మిత్రులు సర్గల నర్సింలు, రమేష్, కిరణ్, భూమేష్, రజాక్, భాస్కర్, శ్రీనివాస్, గణేష్, ఎల్లం, నాగరాజు, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking