ప్రభుత్వం రైతులకు అన్యాయం చెయ్యొద్దు
63వ జాతీయ రహదారిపై ధర్నా
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 11 : పాత రోడ్డు పైనే ఫోర్ వేను నిర్మించాలని ఫోర్ వే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వారు మండలంలోని లక్ష్మిపూర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ…ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం మా భూములు త్యాగం చేశామన్నారు. మిగిలిన ఎకరం,అర ఎకరాన్ని లాక్కొని మా పొట్టపై కొట్టొద్దని అధికారులను కోరారు. గతంలో చేసిన అలైన్ మెంట్ ప్రకారం నాలుగు వరసల రహదారి నిర్మించాలన్నారు. లేదా ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద తీసుకున్న భూములను రోడ్డు నిర్మాణానికి వాడుకోవాలన్నారు.కరకట్ట నిర్మించుకుంటే రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లదని పేర్కొన్నారు.ప్రాణలైన అర్పించి తమ భూములను దక్కించుకుంటామన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదల భూముల జోలికి రావద్ధన్నారు.గూడెం టెంపుల్ నుండి మొదలుకొని లక్షెట్టిపేట,ఇటిక్యాల,నుండి వేంపల్లి వరకు వందల మంది రైతుల వేల ఎకరాల భూమి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం మా భూముల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఇటిక్యాల, మోదెల NH 63 రోడ్డు విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు పాత ప్లాన్ ప్రకారమే రోడ్డు విస్తరణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇదివరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద భూములు ముంపులో అన్నీ పోగొట్టుకున్నామని, మిగిలిన ఈ కాస్త భూమి కూడా మాకు లేకుండా చేయొద్దన్నారు.ఇప్పటికే తినడానికి తిండి లేక చేస్తున్నారని,ఇక మాకు పురుగుల మందే దిక్కని రైతులందరూ వాపోయారు. ఆందోళన చేస్తున్న రైతులను ఎస్ఐ చంద్రకుమార్ నచ్చజెప్పి ఆందోళన విరమింప జేశారు.ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట, మోదెల,ఇటిక్యాల, పోతపల్లి,సూరారం, గుల్లకోట,హాజీపూర్ గ్రామాల రైతులు పాల్గొన్నారు.