పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం…
మెదక్ జిల్లాలో. కొల్చారం మండలం పైతర గ్రామ పరిసరాలను పరిశీలించినా..
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజాబలం దినపత్రిక – కొల్చారం మండలం
06-9-2024:
జిల్లాలో ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు
శుక్రవారం మెదక్ జిల్లా కొల్చారం మండలం పైత్ర గ్రామాల్లో సంబంధిత జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తో కలిసి గ్రామ పరిసరాలు పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరూ వ్యక్తిగత శారీరక పరిశుభ్రతపై దృష్టి సారిస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదేవిధంగా గ్రామంలో దోమల నివారణకు చేపడుతున్న యాంటీ లార్వెల్ ఆపరేషన్లను పగడ్బందీగా అమలు చేయాలన్నారు
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మురుగు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమలు ప్రబలకుండా మందుల పిచికారి చేయాలన్నారు.సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలను రక్షించేందుకు వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా పంచాయతీ అధికారి సమన్వయంతో వ్యవహరించాలన్నారు.
ప్రజలు కాచి చల్లార్చి వడబోసిన నీటినే తాగాలని మరియు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను సేవించకుండా తాజాగా వేడిగా ఉన్న పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. తద్వారా వ్యాధులు దరి చేరమని చెప్పారు.

వాతావరణంలో మార్పు వలన అంటువ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి వాటిని అరికట్టడంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉన్నదని
ప్రజలంతా స్వచ్ఛందంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు పుట్టకుండా కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకొని వ్యాధులకు గురి కావద్దని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ఇతర గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.