సమాచార హక్కు వికాస సమితి
మెదక్ జిల్లా కాన్స్టిట్యూషన్ మెంబర్ బైండ్ల లక్ష్మణ్
ప్రజాబలం దినపత్రిక- మెదక్ జిల్లా నియోజకవర్గo
06-09-2024:
మెదక్ జిల్లా నియోజకవర్గం జిల్లా సమాచార హక్కు వికాస సమితి మెదక్ జిల్లా కాన్స్టిట్యూషన్ మెంబర్ బైండ్ల లక్ష్మణ్ మాట్లాడుతూ మెదక్ జిల్లా నియోజకవర్గ ప్రజలకూ వినాయక చవితిశుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ మెదక్ జిల్లా నియోజకవర్గ ప్రజలు శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని జరుపుకునే క్రమంలో ఎటువంటి దుర్ఘటన సంఘటన జరగకుండా యువకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ వైర్లు సౌండ్ బాక్స్లూ తదితర విషయంలో జాగ్రత్తగా ఉండాలని వినాయక చవితి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని కోరారుతూ వినాయక చవితి విశిష్టతను తెలియజేశారు
ఏ పని తలపెట్టిన వినాయకుని పూజతోనే మొదలు పెడతారు. విగ్నేశ్వరుడిని పూజించి పనిమొదలు పెడితే ఆ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని ప్రజల నమ్మకం. హిందువులు జరుపుకునే పండుగల్లో వినాయక చవితికి ఒకటి. ఈ వినాయక చవితిని 3 నుండి 11 రోజులవరకు వారి వారి స్తోమతను బట్టి జరుపుకుంటారు. కాగా వినాయక చవితి భాద్రపద మాసం లో వస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా వినాయక చవితి ఎప్పుడు బాధ్రపద మాసం అంటే ఆగష్టు- సెప్టెంబర్ నెల్లల్లోనే ఎందుకు జరుపుకుంటారో? దీని వెనక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం మనలో చాలా మంది పాశ్చాత దేశాలను అనుసరిస్తూ మన సంప్రదాయాలను మరియు మనం పాటించే నియమాలను చాదస్తం అని కొట్టిపారేస్తున్నారు. కానీ మనం తెలుసుకుంటే మనం పూరివికులు పాటించే ప్రతి విషయం వెనక ఏదో ఒక సైన్స్ దాగి ఉంటుంది. ప్రస్తుతం మనం వినాయక చవితి గురించి చూదాం. వినాయాక చవితిని భాద్రపద మాసంలో వచ్చే మొదటి చవితి రోజు జరుపుకుంటారు. ఆ రోజు మట్టితో వినాయకుని ప్రతిమని చేస్తారు. అలానే పసుపు ముద్దని చేసి వినాయకుని ప్రతిమని ప్రతిష్టించిన చోటే ఉంచి పూజిస్తారు.
వినాయకుని పూజకి 21 రకాల ఆకులని ఉపయోగిస్తారు. పూజ కి ఉపయోగించే ప్రతి ఆకు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అలానే ఆవిరి పైన చేసే వంటకాలనే నైవేద్యంగా ఉపయోగిస్తారు. దీనికి కారణం భాద్రపద మాసం అంటే ఆగష్టు మరియు సెప్టెంబర్ లలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా జలుబు, జ్వరం లాంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. మరియు మనిషిలో వ్యాధి నిరోధక శక్తీ కూడా తగ్గుతుంది. అందుకే వినాయకుని పూజకు ఉపయోగించే పత్రిలో జిల్లేడు, తులసి, మొదలైన ఆకులు ఔషధంగా ఉపయోగపడతాయి. అలానే ఆవిరి పైన వండిన ఆహారాలు ప్రసాదంగా తీసుకోవడం వాళ్ళ జీర్ణ వ్యస్థ ఆరోగ్యంగా ఉంటుంది.