ఐసీడీఎస్,ఏసీడీపీవో వెంకటరమణమ్మ
ప్రజాబలం దినపత్రిక – మెదక్ నియోజకవర్గం
06-09-2024:
మెదక్‌లో జిల్లాలో పోషక మాసోత్సవంలో సీమంతాలు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు
అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కౌమార దశ బాలికలకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామని దీనిని సద్వినియోగం చేసుకోవాలని మెదక్ ఐసీడీఎస్ ఏసీడీపీవో వెంకటరమణమ్మ సూపర్వైజర్లు జయంతి, విజయలక్ష్మీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని శ్రీరామ్‌నగర్ కాలనీ, జంబికుంట కాలనీల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషక మాసోత్సవాన్ని పురస్కరించుకొని అంగన్వాడీ టీచర్లు ప్రత్యేకంగా నిర్వహించిన సామూహిక సీమంతాలు, అన్నప్రాసనలు, అక్షరాభ్యసాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయా కేంద్రాల్లో ముఖ్య అతిధులుగా ఏసీడీపీవో వెంకట రమణమ్మ, సూపర్వైజర్లు జయంతి, విజయలక్ష్మీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ ఏసీడీపీవో వెంకటరమణమ్మ మాట్లాడుతూ… ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లోనూ చిన్నారుల నుంచి గర్భిణులు, బాలింతలకు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తోందని… గర్భిణిగా ఉన్న సమయం నుంచి బిడ్డ పుట్టేవరకు టీకాలు ఇవ్వడం, కాన్పు జరిగేంత వరకు ఎన్నో సేవలందిస్తున్నట్లు వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న వెంటనే వారికి పౌష్టికాహారం అందించడంతో పాటు కావాల్సిన సదుపాయాలు సైతం సమకూరుస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో అంగన్వాడీ టీచర్లు శిరీష, అశ్విని, రేణుక, స్మరణ, మమత, శివరాణి, గుణశ్రీ, మమత, సిద్ధమ్మ, వినోద తదితరులు పాల్గొన్నారు.