హర్షం వ్యక్తం చేసిన బిల్డర్స్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 21 (ప్రజాబలం) ఖమ్మం మీడియా సమావేశం TCV రెడ్డి ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్డు ఖమ్మం రూరల్ లొ సమావేశము జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలు గా రియల్ ఎస్టేట్ కుంటుపడింది బిఆర్ఎస్ ప్రభుత్యం ప్రజలను చాలా ఇబ్బందులకపాలు చేసింది అలాగే నిర్మాణరంగం వారు ఇబ్బందులు పడ్డారు ఇలాంటి సమయం లో మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న ఎన్నికల ముందు రోజు మాకు మాట ఇచ్చారు ఇచ్చిన మాటకు ఈరోజు రియల్ ఎస్టేట్ కు జీవం పోశారు. అంతమాత్రమే కాదు 25 శాతం రిబేటు తో రెగ్యులర్ చేసుకుంటానికి అవకాశం ఇచ్చారు 2020 ఆగస్టు 28 వరకు రిజిస్ట్రేషన్ అయ్యిన ప్లాట్ లు ఎల్ ఆర్ ఎస్ కింద రెగ్యులర్ చేసుకోమని చెప్పిన బి ఆర్ ఎస్ ప్రభుత్యం మళ్లీ చేయద్దు అని మెమో రూపేణ ఆపి సుప్రీం కోర్టుకు వెళ్లింది ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేసింది ఎల్ఆర్ఎస్ రూపేణా ఆనాటి ప్రభుత్యం 25 లక్షల అప్లికేషన్ ద్వారా నాటి మంత్రి కేటీఆర్ 1200 కోట్లు వసూలు చేశారు గత ప్రభుత్యం ఇచ్చిన జీవో ద్వారా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే ఒక మెమో విడుదల చేసింది ఆపమని మా బిల్డర్స్ అసోసియేషన్ హైకోర్టు కు వెళ్లి స్టే తెచ్చుకుంటే వాళ్ళు సుప్రీంకోర్టు కు వెళ్లి ఆపారు మా ఇబ్బందుల ను గుర్తించిన శ్రీమన్నకు ఈ రోజు పాలాభిషేకం చేసాము అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కి వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు కి ధన్యవాదము లు తెలుపుతున్నాము ఈ కార్యక్రమంలో బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షులు తుంపాల కృష్ణమోహన్ గౌరవ సలహాదారులు గరికపాటి ఆంజనేయ ప్రసాద్ క్రెడాయ్ అద్యక్షులు బండి జయకిశోర్ కలీల్ బాయ్, లక్మణ్ నాయక్ షేక్ ఖాసీం తదితరులు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నుంచి బానోతు సత్యనారాయణ తదితరులు రియల్ ఎస్టేట్ మరియు బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు
