బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్
హైదరాబాద్ జూన్ 22 ();బీసీలకు ఎంత అన్యాయం జరిగినా అడిగేవారే లేరనే అహంతో ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని అందుకే క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకోకుండా హడావిడిగా కులవృత్తులకు అందిస్తున్న లక్ష రూపాయల సాయానికి సంభంధించిన దరఖాస్తులను హఠాత్తుగా ప్రభుత్వం నిలిపివేయిందని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు.. లక్ష రూపాయల రుణాన్ని ఎన్నికల స్టంట్ గా కాకుండా ఒక సంతృప్తికరమైన ప్రణాళికతో , విధానంతో అమలు పరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..బీసీ కులవృత్తులకు 100 కోట్ల కేటాయింపుతో కూడిన లక్ష రూపాయల సాయం కేవలం పదివేల మందికే చెందనుండగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మిగతా 45 లక్షల బీసీ కుటుంభాలను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోబోతుందో జవాబు చెప్పాలన్నారు.. ఆధ్యంతం లోపభూయిష్టముగా కొనసాగిన ఈ పథక రూపకల్పనలో ప్రధాన బీసీ కులవృత్తులైన మున్నూరు కాపు, ముదిరాజు , యాదవ , పద్మశాలీ, గౌడ కులాలను చేర్చక పోవడం చూస్తే కులాల మధ్య చిచ్చు పెట్టాలనే ప్రభుత్వ భావన స్పష్టంగా అర్థమవుతుందన్నారు.బీసీ బందు పేరిట కొందరు నాయకులు ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారని , ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీలను పథకాలకు పరిమితం కాకుండా అధికారంలో వాటాకై ఉద్యమించేలా కులసంఘాలు,సామాజిక సంఘాలు కార్యాచరణను రూపొందించుకోవాలని కోరారు. అధికారం అట్టడుగు, బలహీన వర్గాల చేతిలో ఉంటే వారికి అవసరమైన పథకాల రూపకల్పన,నిర్వహణ మరింత మెరుగ్గా ఉంటుందన్న విషయాన్ని కులసంఘాలు గమనించాలన్నారు..అగ్రవర్ణ పాలకులు బీసీల మధ్య ఎన్నిచిచ్చులు పెట్టినా, బీసీలను విడగొట్టి ఓట్లు దండుకోవాలని చూసినా పసిగట్టలేని దీన పరిస్థితిలో బీసీలు లేరని, భావజాలపూర్వకంగా, సాంస్కృతికంగా, సైద్ధాంతికంగా, సామాజికంగా బీసీలంతా ఒక్క తాటి పైనే ఉన్నారని వివరించారు.. ఎన్నికలు సమీపించే వేల కేవలం బీసీలను పథకాలకు మాత్రమే పరిమితం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని ఏ రాజకీయ పార్టీ అయినా బీసీలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో 50 శాతం సీట్లను కేటాయించి సముచితంగా గౌరవిచకపోతే ఎన్నికల ఫలితాలలో శృంగభంగం తప్పదన్నారు..బీసీల ఓట్లపై అనివార్యతను ఏర్పరచడంతో బాటు బీసీలకు రానున్న ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు 50 శాతం టికెట్ల కేటాయింపును కేటాయించేలా రాజకీయ అనివార్యతను సృష్టించే విధంగా తమ తదుపరి కార్యాచరణను ఉండబోతుందని దాసు సురేశ్ తెలిపారు
Next Post