వేచి చూస్తున్న విద్యార్థులు..
తెరుచుకొని బడి తాళం…
జగిత్యాల ప్రతినిధి, జూన్ 22, (ప్రజాబలం)
విద్యార్థుల కంటే ముందే బడికి చేరుకోవాల్సిన ప్రభుత్వ టీచర్లు సమయపాలన పాటించక పోవడంతో బడికి వచ్చిన విద్యార్థులు బడిముందే కూర్చొని టీచర్ల కోసం పడిగాపులు పడిన సంఘటన ఇది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తుండగా అందులోని కొందరు ఉపాధ్యాయులు సకాలంలో బడికి రాక తాళం తీయక విద్యార్థులను బయట వేచి ఉంచిన సంఘటన ఆ గ్రామంలో చర్చకు దారితీసింది.
జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అందులో ఒకరు కరీంనగర్ నుండి వస్తుండగా మరొకరు జగిత్యాల నుండి వస్తారు. ప్రాథమిక పాఠశాల ను ఉదయం 9 గంటలకి తెరవాల్సి ఉన్నా ఇక్కడి ఉపాధ్యాయులకు బద్దకం పెరిగింది. దీనికితోడు విద్యాశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఇక్కడి ఉపాద్యాయుల్లో నిర్లక్ష్యానికి కారణమన్నట్లు తెలిసింది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకే పాఠశాలను ఓపెన్ చేసి బోధన మొదలుకావాల్సి ఉండగా గురువారం 9.20 అవుతున్నా ఉపాధ్యాయుల జాడలేకుండా పోగా సార్ల కోసం విద్యార్థుల ఎదురుచూపులు కనిపించాయి. ఎట్టకేలకు 9.30 వరకు జగిత్యాల కు చెందిన ఉపాధ్యాయుడు వచ్చి విలేఖరులతో ప్రాథమిక పాఠశాల ఓపెనింగ్ సమయం 9.30 అంటూ తప్పుదారిపట్టించే ప్రయత్నాలు జరిగాయి. తొమ్మిది గంటల 20 నిమిషాలు గడుస్తున్నా ఉపాధ్యాయులు రాకపోవడంతో విద్యార్థులు బడి బయటే వేచియున్నారు అని విద్యార్థులను ఎందుకు ముందే వచ్చారు అని ప్రశ్నించగా బడి సమయము గడిచిన సార్లు రాలేదంటూ విద్యార్థులు చెప్పిన సమాధానం తోనే ఉపాధ్యాయులు సకాలంలో బడికి రారు అని విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించాలని చదువుపై ఎంతో ఆసక్తితో ప్రభుత్వ బడికే వస్తున్న విద్యార్థుల ఆలోచనలు మారకముందే ముత్యం పేట ప్రాథమిక పాఠశాలను సరియైన దారిలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు