ప్రభుత్వం తక్షణమే వికలాంగుల బందు ప్రకటించాలి

మహబూబాబాద్ ప్రతినిధి సెప్టెంబర్ 27 (ప్రజాబలం) మహబూబాబాద్ జిల్లా కురవి మండల యం.పి.డి.ఓ ను కలిసి వికలాంగుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అందులో భాగంగా వికలాంగులు హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాజా మాట్లాడుతూ వికలాంగులు ఆర్థికంగా సామాజిక, మరియు రాజకీయంగా వెనకబడి వుండటం ప్రస్తుత కాలంలో వికలాంగులు అనేక సమస్యల తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని కావున వారిని ఆర్థికంగా బలోపేతం చేయుట కోసం బి.సి బందు, దళిత బందు తరహాలో వికలాంగ బందు ప్రకటించి ఆదుకోవాలని అదే విధంగా గృహలక్ష్మి పథకాలలో 5% రిజర్వేషన్ చట్టంలో ఉన్నప్పటికీ అమలు లో నోచుకోవడం లేదు ఇప్పటికైనా సక్రమంగా ప్రభుత్వ పథకాలు అమలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.యం.పి.డి.ఓ వెంటనే స్పందించి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్తినెని సీతారామయ్య బత్తిన వెంకన్న ఇర్రి యాకయ్య కర్నాటి మల్లికార్జున్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking