జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్
ఖమ్మం ఏప్రిల్ 11 ();ఖమ్మం లోని శ్రీ శ్రీ సర్కిల్ లో గల మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడే పల్లి కృష్ణమాచారి పూలమాలను వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ వివక్ష ,అణిచివేత, అసమానతలు లేనటువంటి సమ సమాజ స్థాపనతో పాటుగా ఆనాడు ఉన్నటువంటి మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుడాలి అని అనాడు మాత్రమే దేశ పురోగతి చెందుతుందని భావించి తన ఇంటి నుండే మార్పు తెచ్చినటువంటి మహనీయుడు జ్యోతిబాపూలే అని ఆయన అన్నారు.జ్యోతిబా పూలే జయంతిలో భాగంగా గౌరవ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,బండి పార్థసారథి రెడ్డి, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరారావు,మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ,డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం,సుడా కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, ఖమ్మం సీపీ విష్ణు వారియర్, ఆర్ జె సి కృష్ణ,మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్వేత,బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారిని జ్యోతి లు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారితో పాటుగా వివిధ సంఘాల నాయకులు ప్రముఖులు పాల్గొని ఆ మహనీయుడికి నివాళులర్పించారు.
Prev Post
Next Post