ప్రజలకు చెరవలో లయన్స్ సేవలు

తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో చలివేంద్రం ప్రారంభం

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంస్కరణలతో ప్రయాణికులకు సౌకర్యం

తూప్రాన్, ఏప్రిల్,11. ప్రజా బలం న్యూస్ :-

తూప్రాన్ లయన్స్ క్లబ్ సేవలు ప్రజలకు చేరువలో ఉండి ఎంతో దోహదపడుతుందని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీమతి సురేఖ అన్నారు. మంగళవారం ఉదయం తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో కంట్రోలర్ గున్నాల రాములు గౌడ్ కంట్రోల్ లో బ్లూ స్టార్ కంపెనీ వాటర్ కూలింగ్ మిషిన్ ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ను డిఎం సురేఖ ప్రారంభించారు. అనంతరం ఆమే మాట్లాడుతూ వేసవికాలంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బృహత్తరమైన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నట్లు వివరించారు. ప్రజల చెంతకు ఆర్టీసీ సేవలు అందించాలనే సంకల్పంతో గ్రామాల్లో పర్యటించి వికలాంగులకు బస్ పాస్ లు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త మాట్లాడుతూ తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఆర్టీసీ వారు బ్లూ స్టార్ కూలింగ్ మిషిన్ అందజేయడం శుభ పరిణామమని అన్నారు. అనంతరం లయన్ డాక్టర్ ప్రదీప్ సింహ్మ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం లో ఈ సారి సేవచేసే భాగ్యం తనకు లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ వేసవికాలంలో బ్లూ స్టార్ కూలింగ్ మిషన్ లో ప్రతి రోజు మినిరల్ వాటర్ ను తన సొంత డబ్బులతో ఏర్పాటు చేసి ప్రయాణికులకు సేవ చేయడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం లయన్ జానకిరామ్ మాట్లాడుతూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు ఏ శాఖ లో ఉన్నా కొత్త కొత్త సంస్కరణలతో తనదైన ముద్ర వేసి ప్రజారాంజకంగా ముందుకు సాగడం ఆయన నైజం అన్నారు. నేడు ఆర్టీసీ ఎండీ గా మహిళలకు రిజర్వేషన్, ప్రజల చెంతకు ఆర్టీసీ అంటూ ఆర్టీసీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఇదే మొదటిసారి అన్నారు. వేసవికాలంలో చల్లటి త్రాగునీరు అందించడం లక్ష్యంగా చేసుకొని బ్లూ స్టార్ కూలింగ్ వాటర్ మిషన్ లను అందజేయడం ఒక గొప్ప సంస్కరణ అని వారి ఆలోచనలను శ్లాఘించారు. వేసవి కాలంలో వివిధ ప్రాంతాలకు పనుల నిమిత్తం సుదూర ప్రాంతాలకు బస్సుల్లో వెళ్లే వారికి మార్గ మధ్యలో తూప్రాన్ బస్టాండ్ లో కూల్ కూల్ చల్లటి మినరల్ వాటర్ ను లయన్ డాక్టర్ ప్రదీప్ సింహ్మ సౌజన్యంతో అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ వంగ భాస్కర్ రెడ్డి, సెక్రటరీ లయన్ కే. శశిభూషన్ రెడ్డి, ట్రెజరర్ లయన్ పుట్ట వెంకటేష్, లయన్ డాక్టర్ శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking