చెగుంట ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని చేగుంట మండల కేంద్రం లో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన నాయకులు. ఈ సందర్భంగా చేగుంట తాసిల్దార్ లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశారు అని,సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తి అని, సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు అని,అతను మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు అని అన్నాడు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, పరమేశ్వర్ రెడ్డి,వివిధ సంఘాల మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు రావుల వెంకటేష్, మనోహర్, బాల పోచయ్య, పెంట గౌడ్, రేఖ, మరియుపరంజ్యోతి,ప్రవీణ్, రమేష్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.