హైకోర్టు ఆర్డర్ ఉన్నా కబ్జాను ఆపలేదు

జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం నిల్

న్యాయాన్ని కాపాడాలని బాధితుడి ఆవేదన

జగిత్యాల, ఏప్రిల్ 18: ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పనిచేయాల్సిన అధికారులు ఆ దిశగా కృషిచేయకపోగా కోర్టు పరిధిలో ఉన్న ఓ ఇంటిని, స్థలాన్ని కబ్జాకు పాల్పడుతుండగా వారసులమే ఫిర్యాదు చేసినా న్యాయం దొరకడంలేదని కండ్లపల్లి గ్రామానికి చెందిన తొగిటి వెంకట్రాములు ఆవేదనతో పేర్కొన్నారు. మంగళవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో విడుదల చేసిన ప్రకటనలో బీర్పూర్ మండలంలోని కండ్లపల్లి గ్రామంలో సర్వే నెం 18లో మా తాతకు చెందిన 38 గుంటల భూమిలో మూడు ఇండ్లు నిర్మించి ఉన్నాయన్నారు. గంగారం. రాజన్న. రాములు ముగ్గురికి ఇల్లు ఉన్నాయి ఈ ఆస్తి అంశం హైకోర్టులో కేసు నడుస్తోందని కేసు తీర్పు వచ్చేవరకు ఆ స్థలంలోకి ఎవరు ఎంటర్ కారాదని నిబంధన ఉందని వెంకట్రాములు పేర్కొన్నారు. మా తండ్రికి వెంకట్రాములు, కలాచారి, నాగభూషణం అనే ముగ్గురు కొడుకులమని పేర్కొన్నారు. అయితే మా చిన్న తమ్ముడు నాగభూషణం అక్రమంగా మా తాత భూమిలో అడుగుపెట్టి అందులోని ఇంటిని కూల్చివేశారన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే చంపేస్తా అని బెదిరింపులకు దిగాడని ఇదే విషయంలో 8 సెప్టెంబర్ 2022 న బీర్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఇదే ఏడాది ఫిబ్రవరి 27, మార్చి 13, 18, 27న, ఏప్రిల్ 3న జగిత్యాల జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చిన పాత ఇంటి స్థానంలో కొత్త ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వరాదని ఎన్నోసార్లు పంచాయతీ కార్యదర్శి, ఎంపిడివో, డిపివో కు ఫిర్యాదు చేసినా చివరకు ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చారన్నారు. ఒకసారి హియరింగ్ పేరిట ఎప్రిల్ 10 పిలిచిన జిల్లా పంచాయతీ అధికారి ఏకపక్షంగా మాట్లాడినట్లు వెంకట్రాములు పేర్కొన్నారు. న్యాయ రక్షణకు, ప్రజల సమస్యల పరిష్కారానికి ఉన్న జిల్లా అధికారులు స్పందించాలని న్యాయాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని కోర్టు కేసును బేఖాతరు చేసిన వ్యక్తిపై, అధికారులపై కఠిన చర్యలు తీసుకొని న్యాయాన్ని రక్షించాలని తొగిటి వెంకట్రాములు కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking