చీమలపాడు ఘటన చాల బాధకారం పోలీస్ కమిషనర్

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 12 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో ఈరోజు జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన బాధాకరమని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. జరిగిన సంఘటనను తెలుసుకున్న పోలీస్ కమిషనర్ నగరంలోని సంకల్ప హాస్పిటల్, ,ప్రభుత్వ హాస్పిటల్ ను సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు. ఈఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారని, ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా వుండి వైద్యశాలకు తరలించడం..
ఆనంతరం చికిత్స పొందితూ.. మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. గాయపడిన వారికి అందుతున్న వైద్యం గురించి వైద్యులతో మాట్లాడినట్లు తెలిపారు. గాయపడిన బాధిత ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నవీన్ కుటుంబసభ్యులతో మాట్లాడిన పోలీస్ కమిషనర్ మెరుగైన వైద్యం అందిస్తునట్లు, ధైర్యంగా వుండాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking