ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ పట్టణం భాగ్య నగర్ లో తెలంగాణ ముస్లిం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు .మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ లో పాల్గొన్నారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం మహోన్నతమైనదని పేర్కొన్నారు.ముస్లీం సోదరులు రంజాన్ మాసం లో తమ నిత్య ప్రార్థనలతో అల్లా ను ప్రార్థిస్తారని తెలిపారు ఈ మాసం వారికి చాలా పవిత్రమైనదని ప్రతి ఒక్కరూ మతసామరస్యతకు పాటుపడుతూ అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకున్నారు ఏప్రిల్ 18 తారీఖున హోం శాఖ మంత్రి మహమూద్ అలీ తో కలిసి చించోలి వద్ద గల నూతన ఈద్గాను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి అదనపు కలెక్టర్ రాంబాబు మున్సిపల్ చైర్మన్ జి ఈశ్వర్ ఆర్డిఓ తదితరులు పాల్గొన్నారు.