డిసిసిబి డైరెక్టర్, మేకల మల్లిబాబు యాదవ్
ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 18 (ప్రజాబలం) తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా ఖమ్మం జిల్లా యాదవ కురుమల సమస్యలను పరిష్కరించ డానికి అభివృద్ధి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టాలని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు జిల్లా గొర్రెల పెంపకం దారుల సంఘం అధ్యక్షులు, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కో కమిటీ కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని యాదవ కురుమ సంఘం నాయకులు గొర్రెల పెంపకం దారుల సంఘాల అధ్యక్షులు, సభ్యులతోకలిసి యాదవ కురుమ సమస్యలను వివరించి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పందించి ఈ సమాజంలో నమ్మకానికి మారుపేరైన మాట ఇస్తే మాట తప్పని కురుమ యాదవుల సమస్యల పరిష్కారానికి తప్పగా ప్రయత్నిస్తానని, పార్టీ అధిష్టానంతో మాట్లాడి మేనిఫెస్టోలో ప్రకటింప చేస్తానని హామీ ఇచ్చారని మల్లి బాబు యాదవ్ తెలిపారు 1993లో యాదవులను కురుమలను గొర్రెల సొసైటీలుగా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని 2006లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో ఫెడరేషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వ మేనని, 2017 జూన్ 20 న యాదవ కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం ప్రవేశపెట్టిందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ వర్తిస్తుందని మొదట చెప్పడం జరిగిందని, ఈ రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది ఉన్న యాదవ జనాభా కు కేవలం 709,000 మందిని అర్హులుగా ప్రకటించారని, డ్రా ద్వారా ఏ లిస్టు బి లిస్టులుగా విభజించి, ఇంకా బి లిస్టులోని 3,54,791 మందికి గొర్రెల పంపిణీ చేయాల్సి ఉన్నది. ఖమ్మం జిల్లాలో ఇంకా 16,353 మందికి పంపిణీ చేయాల్సింది ఉండగా ఇప్పటివరకు దాదాపు 15 నెలలు కాలంలో 11 000మంది 43,750 రూపాయలు చొప్పున డీడీలు తీసి ఉన్నారు. కానీ కేవలం 780 మందికి మాత్రమే గొర్రెలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. యాదవ కురుమలను మోసం చేయడానికి కమీషన్లకు కక్కుర్తి పడి అండదండతో అవినీతి చర్యలకు పాల్పడుతున్నారని మల్లి బాబు యాదవ్ తెలిపారు
1. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం మేనిఫెస్టోలో ప్రవేశపెట్టగలరు
2. కట్టిన లబ్ధిదారులకు వాటాదనం తిరిగి డబ్బులు వాపసు ఇవ్వాలి
3. వాటాదనం లేకుండా దళిత బంధు బీసీ బందు మాదిరిగా గొర్రెల పంపిణీ పథకంలో అవినీతికి ఆస్కారం లేకుండా నగదు బదిలీ ద్వారా అమలు చేయాలి
4. నగర పట్టణ ప్రాంత యాదవ కురుమలకు ఈ పథకం వర్తింపజేయాలి
ఈ విషయాలను మేనిఫెస్టోలో ప్రకటించాలని కోరారు
ఈ కార్యక్రమంలో టిపిసిసి మెంబర్ నాగ సీతారాములు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మ రోశయ్య, జిల్లా యూనియన్ ప్రధాన కార్యదర్శి గూదే భద్రయ్య, జోనబోయిన పాపయ్య సంఘం అధ్యక్షులు సోమనబోయిన కోటయ్య ఎల్లిబాబు మంద నాగేశ్వరరావు, ముతే బోయిన రామ్మూర్తి చెన్ను వెంకటయ్య పొదిల నరేష్ కాసు మల్లేష్ తుప్పతి రవికుమార్ నరేష్ తదితరులు పాల్గొన్నారు