గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:తెలంగాణా రాష్ట్రంలో బీఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాలు మినహా అన్ని నియోజక వర్గాల అభ్యర్థులను ప్రకటించింది తెలిసినదే.జనగామ నియోజక వర్గానికి పల్లా రాజేశ్వరరెడ్డిని ప్రకటించినారు. కాని గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గానికి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు .గోషామహల్ నియోజకవర్గంలో ఇంఛార్జ్‌గా నియమితులైననందుబిలాల్ వ్యాస్ తనకే టికెట్ కేటాయించినారని ప్రజలలోకి వెలుతున్నారు.ఈ మధ్యనే మైనార్టీ యువకులను పార్టీలో కి కండువా కప్పి చేర్చుకున్నారు. ఇది గ్రహించిన బీఆర్‌ఎస్ సీనీయర్ నాయకులు మాజీ ఎమ్మెల్యేమాజీ కార్పోరేటర్లు బీఆర్‌ఎస్ నాయకులు మాజీ కార్పోరేటర్ మమత ,సంతోష్‌గుప్తా ఆఫీస్‌లో మీటీంగ్ ఏర్పాటు చేసుకున్నారు.విశ్వసనీయ సమాచారం మేరకు మాజీ ఎమ్మెల్యే మాజీ కార్పోరేటర్లు బీఆర్‌ఎస్ మహిళా నాయకురాలు ఒక తీర్మానానికి వచ్చారు.బీఆర్‌ఎస్ నాయకులను మాజీ ప్రజాప్రతినిధులను కలుపుకోని పోయే నాయకునికి బీఆర్‌ఎస్ గోషామహల్ సీటు కేటాయించారని తీర్మానించుకున్నారు.ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ గోషామహల్ ఇంఛార్జ్ నందు బిలాల్ వ్యాస్‌కు ఆహ్వానం అందలేదని తెలిసింది.ఈ ప్రకారం నందు బిలాల్ వ్యాస్ తప్ప ఎవరికి సీటు కేటాయించిన అందరం కలిసికట్టుగా పని చేసి గెలిపించుకుంటామని తీర్మానం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.ఈ కార్యక్రమంలో ప్రేమ్ సింగ్ రాథోడ్ మాజీ ఎమ్మెల్యే,బీఆర్‌ఎస్ మహిళానాయకురాలు శాంతాదేవి
సంతోష్ గుప్తా సీనియర్ నాయకుడు
మమతా సంతోష్ గుప్తా మాజీ కార్పొరేటర్
రాంచేందర్ రాజు మాజీ కార్పొరేటర్
పరమేశ్వరి నిట్టూర్పు మాజీ కార్పొరేటర్
అల పురుషోత్తం పోటీ చేసిన కార్పోరేటర్ అభ్యర్థి
రమేష్ గుప్తా.బాబుతదితరులు పాల్గోన్నారు.
