సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల రుణం తీర్చుకుంటా.

చివరి శ్వాస వరకు ప్రజలకోసం పనిచేస్తా..

పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,ఎమ్మెల్యే అభ్యర్థి దొడ్ల.వెంకట్.

ఈరోజు తెలంగాణ ప్రజాశక్తి పార్టీ పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు యాభై మంది జాయిన్ కావడం జరిగింది.వారికి రాష్ట్ర అధ్యక్షులు, సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి దొడ్ల.వెంకట్ పార్టీ కండువాలు కప్పి ఎర్రోళ్ల రమేష్ తన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ….అతి త్వరలో జరగబోయ్యే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాశక్తి పార్టీ పోటీలో ఉంటుందని సంగారెడ్డి ప్రజలు ఒక్కసారి నన్ను ఆదరించి ఎమ్మెల్యేగా గిలిపిస్తే ప్రజల రుణం తీర్చుకుంటాను, గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు సంగారెడ్డి ప్రజలకు చేసిందేమీ లేదని ఒక్క సారి నన్ను పెద్ద మనస్సుతో ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రాణం ఉన్నంత వరకు ప్రజలకోసం పనిచేస్తా..సంగారెడ్డి నియోజక వర్గంలో ఐదు వేల కోట్లతో అద్దం లాగా అభివృద్ధి చేసి చూపిస్తానని కొంతమంది ప్రజలు ఓటును డబ్బు కోసం దుర్వినియోగం చేసుకోకుండా… నిజాయితీగా ఓటు వేయాలని..రెండు వేల రూపాయలకు మాన మర్యాదలు తాక్కట్టు పెట్టొద్దని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ పాటిల్,రాష్ట్ర కార్యదర్శులు విరేష్ పాటిల్,బ్రాహ్మజి,కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు ఖట్కం వీరేశ్,జిల్లా ఇంఛార్జి నిరాడి రవి జిల్లా నాయకులు ఎర్రోళ్ల రమేష్,
పవన్,జగదీష్,రషీద్, మల్లేష్, గోవింద్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking