కమ్మ సంఘం సంయుక్త కార్యదర్శి నరేష్ చౌదరి స్పష్టీకరణ
ఖమ్మం ప్రతినిధి మే 4 (ప్రజాబలం) ఖమ్మంతో సహా జిల్లాలోని కమ్మ సంఘాలన్నీ కమ్మ వారి విజయాన్ని, సంక్షేమాన్ని పేదల అభివృద్ధిని మాత్రనే కోరుకుంటాయి అంతేగానీ వేరే ఇతర రాజకీయ పార్టీలకు నాయకులకు కమ్మ సంఘం వత్తాసు పలకదని కమ్మ సంఘం స్పష్టం చేసింది.కమ్మ వారికి మినహా వేరే పార్టీ వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కమ్మ సంఘం మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని సంఘం సంయుక్త కార్యదర్శి మందటి నరేష్ చౌదరి వెల్లడించారు కమ్మ వారు ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సు కు, సమాజ అభివృద్ధి లో భాగస్వాములవుతారని నరేష్ చౌదరి స్పష్టం చేశారు