కుమ్మర సంఘం నాయకులు భూమి,భవనం కోసం వినతి పత్రం ఎమ్మెల్యేకి సానుకూలంగా స్పందించినా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 02 : మంచిర్యాల జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే‌ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి,కుమ్మర సంఘానికి భూమి,భవనం కోసం వినతి పత్రం అందజేయడం జరిగింది.దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి,జిల్లా హెడ్ క్వార్టర్ లో 3 గుంటల భూమి,భవన నిర్మాణానికి సహకారం,కుటీర పరిశ్రమ కోసం జిల్లా పరిధిలో మూడెకరాల భూమి,పనిముట్ల కోసం ప్రభుత్వం నుంచి సహకారం, అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి కుమ్మరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కుమ్మర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాంపల్లి శ్రీనివాస్,గౌరవ అధ్యక్షుడు ఇజ్జగిరి రామస్వామి,జిల్లా అధ్యక్షుడు గంగాధరి తిరుపతి,ప్రధాన కార్యదర్శి ప్రసాద్,వర్కింగ్ అధ్యక్షుడు నాంపల్లి తిరుపతి,జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపల్లి సత్యనారాయణ,కోడూరి రాజయ్య,శనిగారపు తిరుపతి,గంగాధరి గంగయ్య,కెల్లేటి తిరుపతయ్య,గంగాధరి నారాయణ,కొడిమ్యాల ధర్మయ్య,దివాకర్,పోడేటి రాజయ్య,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking