టి ఎస్ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
మెదక్ మనోహరాబాద్ ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా మనోహరబాద్ మండలంలోని మనోహరబాద్ మండల కేంద్రంలో వద్ద కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి .
ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి ప్రదాత ప్రజ ఆకాంక్షల సంక్షేమ సారథి కేసీఆర్ అని అన్నారు,
పేదవాడి కంటి వెలుగు తెలంగాణ ఇంటి వెలుగు అన్నారు,
దేశానికి ఆదర్శం కంటి వెలుగు కార్యక్రమం అన్నారు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి తరహా కార్యక్రమం లేదన్నారు
కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు,అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు సైతo చేస్తున్నందున ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకునే స్థోమత లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.కంటి వెలుగు వంటి గొప్ప సంక్షేమ కార్యక్రమాలతో పేద ప్రజలకు అండగా ఉంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్ గారి వైపు యావత్తు భారతదేశం చూస్తుందన్నారు,

ఈ కార్యక్రమంలో మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, రాష్ట్ర సర్పంచుల పొరం కార్యనిర్వాక అధ్యక్షుడు చిట్కుల మహిపాల్ రెడ్డి, ఉప అధ్యక్షులు నత్తి మల్లేష్ ముదిరాజ్ మండల ఎంపీపీ పురం నవనీత రవీ ముదిరాజ్, పిఎసిఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు శేఖర్ ముదిరాజ్, ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.