ఖమ్మం ప్రతినిధి మార్చి 13 (ప్రజాబలం) ఖమ్మం పొంగులేటి యువసేన ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్ బీసీ కాలనీ గ్రౌండ్ నందు నిర్వహిస్తున్న పొంగులేటి యువసేన క్రికెట్ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించిన మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిది గా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ యువత క్రీడా రంగంలో రాణించాలని అన్నారు. క్రీడలు ఆడటం వల్ల ఆరోగ్యానికి అన్నివిధాల చాలా మంచిదన్నారు. యువత మత్తు పదార్దాలకు దూరంగా ఉంటూ పట్టుదలతో క్రీడలయందు మక్కువ పెంచుకుని ముందుకు సాగాలని అయన అన్నారు.అనంతరం యువసేన నాయకులు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమం లో పొంగులేటి యువసేన నాయకులు కంబాల శ్రీనివాసరావు, దామా సందీప్, బత్తుల గోపి, సిద్ధంశెట్టి శంకర్ నాధ్, మిట్టకొల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.