ఈద్గా అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

 

 

రంజాన్ లోగా ఈద్గా నిర్మాణ ప‌నులు పూర్తి చేయాలి:మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ఈద్గా అభివృద్ధి పనుల్లో వేగం పెంచాల‌ని, రంజాన్ లోగా ఈద్గా నిర్మాణ ప‌నులు పూర్తి చేయాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం నిర్మల్‌ పట్టణ శివారు చించోలి(బి) గ్రామ శివారులో నూత‌న ఈద్గా నిర్మాణ ప‌నుల‌ను మంత్రి ప‌రిశీలించారు. రూ. 5 కోట్ల అంచ‌నా వ్య‌యంతో 8.5 ఎక‌రాల విస్తీర్ణంలో చేప‌ట్టిన నిర్మాణ‌ ప‌నుల పురోగ‌తి, మినార్ల ఏర్పాటు, ప్రహరీగోడ, ప్రధానద్వారం నిర్మాణం,టైల్స్, మైక్స్ ఏర్పాటు, నీటి వ‌స‌తి, త‌దిత‌ర ప‌నుల‌ గురించి మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులతో సమన్వయం అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో చ‌ర్చించారు. ఏప్రిల్ 15 లోగా ప‌నుల‌న్ని పూర్తి చేసి రంజాన్ ప‌ర్వ‌దినాన‌ ఇక్కడే ప్రార్థ‌న‌లు జ‌రుపుకునేలా అధికారులు ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు.
అనంత‌రం మంత్రి మాట్లాడుతూ… అన్ని మతాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాల పర్వదినాలకు ప్రజలకు కానుకలను అందజేస్తున్నదని తెలిపారు. ముస్లిం సోద‌రులు ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో, సువిశాల ప్ర‌దేశంలో ప్రార్థ‌న‌లు జ‌రుపుకునేలా ఈద్గాను నిర్మిస్తున్నామ‌ని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking