ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. హజ్ యాత్రికులకు ప్రభుత్వం అన్నిరకాల సహకారం అందిస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈడెన్ గార్డెన్స్ లో నిర్వహిస్తున్న హజ్ యాత్ర శిక్షణ శిబిరాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హజ్ యాత్ర ఎంతో పవిత్రమైందని అన్నారు. ఆర్థిక స్తోమత లేని వారికి సైతం ప్రభుత్వం యాత్రకు వెళ్లే ఏర్పాట్లు కల్పిస్తుందని అన్నారు. హజ్ యాత్రకు వెళ్లేందుకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు నిర్మల్ లో హజ్ హౌస్ భవన నిర్మాణానికి స్థలం నిధులు కేటాయించినట్లు తెలిపారు.హజ్ కమిటీ రాష్ట్ర సభ్యుడు నజీరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.