ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షెట్టిపేట అతిధి అద్యాపకుల భర్తీ కోసం దరఖాస్తుల ఆహ్వానం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 13 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ, పి.జీ.కళాశాలలో ఖాళీగా ఉన్న అతిధి అద్యాపకుల భర్తీ కోసం ప్రిన్సిపాల్ డా.జై కిషన్ ఓజా ఒక ప్రకటనలో దరఖాస్తులను ఆహ్వానించారు.కళాశాలలో ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి ఒక గెస్ట్ ప్యాకల్టీ పోస్టు ఖాళీగా ఉంది. ఇందుకోసం ఇంగ్లీష్ సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో పి.జీ.పూర్తి చేసి ఉండాలి. పి.హెచ్.డి.పూర్తి చేసినవారికి, నెట్/సెట్ అర్హత కలిగిన వారికి పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడును.ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి16వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటల లోపు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలి.దరఖాస్తు దారులకు మార్చి 17 శుక్రవారం రోజు డెమో,ఇంటర్వ్యూ లను నిర్వహిస్తారు.అభ్యర్థులు ఒరిజినల్ ధృవపత్రాలతో ఇంటర్వ్యూ కి హాజరు కావలసి ఉంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking