దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందన్న ప్రముఖులు
అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు
హైదరాబాద్ మార్చ్ 13 :దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్సీ ఎల్ రమణలు అన్నారు పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని సత్యం టెక్నో స్కూల్ చైర్మన్ గుజ్జ సత్యం, ప్రిన్సిపల్ అరవింద్ బాబుల ఆధ్వర్యంలో జరిగిన పాఠశాల 12వ వార్షికోత్సవానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని అందుకోసం వారి తల్లిదండ్రులు కూడా పూర్తిగా సహకరించాలని సూచించారు.సత్యం టెక్నో స్కూల్ నేడు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇందులో విద్యను అభ్యసిస్తూ ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను చిన్నతనంలోనే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు వివిధ రంగాలలో నైపుణ్యత సంపాదించాల్సిన అవసరం ఉంది అన్నారు. అంతకుముందు ఏర్పాటుచేసిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అనంతరం పాఠశాల చైర్మన్ సత్యం, ప్రిన్సిపాల్ అరవిందు బాబులు మాట్లాడారు. సత్యం టెక్నో స్కూల్ ఈ స్థాయికి రావడానికి, తమ అభివృద్ధికి సహకరిస్తున్న అందరికీ, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తాము శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రానున్న రోజులలో విద్యార్థులలో పలు పోటీ కార్యక్రమాల రూపొందిస్తూ విద్యార్థులు ప్రతిభను కనబరిచేలా చేస్తామన్నారు. అదేవిధంగా విద్యార్థులకు విద్యానందించడంలో తమ స్కూలుకు ప్రత్యేకత ఉందని నిరూపిస్తామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకురాలు విమలక్క, బీసీ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యం, రాష్ట్ర కన్వీనర్ లాల్ కృష్ణ, టి పి సి సి కార్యదర్శి దండం రామ్ రెడ్డి కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, రాజేందర్ నాయకులు కోలా జనార్దన్ మల్లేష్ రామలింగం సురేష్ పాండరీనాథ్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
