సనాతన సంస్కృతి కి వారధి మహిళామూర్తి సామాజిక ఆరోగ్య అధికారి బడుగు శ్రీరాములు

చౌటుప్పల్ మార్చ్ 13;అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించు కొని శ్రీ పాలకూర్ల శివయ్య గౌడ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చౌటుప్పల్ మినీ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలకు పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పాలకూర్ల మురళి గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మహిళలకు ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సామాజిక ఆరోగ్య అధికారి బడుగు శ్రీరాములు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన సంస్కృతి కి వారధి మహిళామూర్తి అని కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి పురుషులకు దీటుగా ప్రపంచమంతా తమ వైపు తిరిగి చూసేంతగా తమ ప్రతిభను చాటాలన్నారు. ప్రస్తుతం సమాజం లో మహిళపై జరుగుతున్నా అత్యాచారాలు అరాచకాలను ఆయన తీవ్రంగా ఖండించారు.వీటిపై ప్రభుత్వాలు మరింత స్పందించి వాటిని అరికట్టాలని అందుకు మరింత కథినమైన చట్టాలు తేవాలని అన్నారు. అనంతరం విజేతలకు ఆదర్శ మాతృమూర్తులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినిలు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు కేజీబీవీ ఉపాధ్యాయ వర్గం బి సునీత, సుజాత, కే సునీత, నూజాత్ సుల్తానా, జయలక్ష్మి, పి అనిత, జే ప్రమీల, బి స్వాతి, తో పాటు అనేకమంది విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking