ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 13 : ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి వార్షిక పరీక్షల్లో 100% మార్కులు సాధించి పాఠశాల తో పాటు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలల ఆర్ సి ఓ గోపీచంద్ నాయక్ సూచించారు. పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర కళాశాల తో పాటు బాలుర గురుకుల పాఠశాలను సోమవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆర్ సి ఓ గోపీచంద్ నాయక్ మాట్లాడుతూ….ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రతి విద్యార్థి ఇంతకాలం నేర్చుకున్న విద్యను వార్షిక పరీక్షల్లో తమ ప్రతిభను చాటి ఉత్తమ ఫలితాలు సాధించాలని తెలిపారు. పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తన యొక్క మేధాశక్తి ఉపయోగించినప్పుడే భవిష్యత్తు చాలా బాగుంటుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమం కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని ప్రతి విద్యార్థికి సంవత్సరానికి లక్ష 30 వేల రూపాయలు వెచ్చిస్తుందని తెలిపారు. అంతేకాకుండా బోధన కోసం మంచి శిక్షణ ఉన్న ఉపాధ్యాయులను నియమించి విద్యను అందించడం జరుగుతుందని సూచించారు. విద్యార్థులు గురువులు బోధించిన అంశాలను శ్రద్ధగా విన్నట్లయితే ప్రతి విద్యార్థి కూడా 100% మార్కులతో విజయం సాధించవచ్చునని అన్నారు. అంతేకాకుండా గత రెండు నెలల నుండి ఇంటర్మీడియట్ విద్యార్థుల తోపాటు పదవ తరగతి విద్యార్థులకు ఉదయం 5 గంటల నుండి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు ప్రశ్నల పై అవగాహన కల్పించి కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత డిగ్రీ కళాశాలలో కూడా ప్రవేశాలు పొందడానికి అర్హులుగా ప్రతి విద్యార్థి ఉండాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కళాశాలతో పాటు పాఠశాల ప్రిన్సిపల్ కరీంనగర్ జిల్లా ఆర్సిఓ గౌతమ్ కుమార్ రెడ్డి, ఏటీపీ స్వప్న కుమారి, కళాశాల , ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.