-రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి జిల్లా ఇంచార్జీ బుర్రి సతీష్ మాదిగ
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ డిసెంబర్ 18 :
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ సంస్థాగత నిర్మాణం బలోపేతం చేయడంలో భాగంగా మందమర్రి మండల కేంద్రంలోని సారంగపల్లి గ్రామంలో గురువారం మండల సదస్సును
నిర్వహిస్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి బురి సతీష్ మాదిగ తెలిపారు. బుధవారం ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలు కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వ మీద జరగబోయే పోరాటానికి మాదిగ బిడ్డలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టడానికి సంసిద్ధం కావాలని కోరారు. ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ కమిటీలను ఏర్పాటు చేసుకొని నూతన జెండా ఆవిష్కరణ చేసుకొని జాతిని పోరాటానికి సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో మండల సీనియర్ నాయకులు జీడి సారంగం మాదిగ, అసంపల్లి శివకుమార్ మాదిగ, చిలుముల రాజ్ కుమార్ మాదిగ, ఆసంపల్లి అఖిల్ మాదిగ, అసంపల్లి అనిల్ మాదిగ, అరికిల్ల ప్రసాద్ మాదిగ, చిప్పకుర్తి మురారి మాదిగ తదితరులు పాల్గొన్నారు.