తూప్రాన్ పట్టణంలో ఎల్లమ్మ కళ్యాణానికి హాజరైన మైనంపల్లి హనుమంత్ రావు

 

తూప్రాన్, డిసెంబర్, 17ప్రాజబలం ప్రతినిధి.

మెదక్ జిల్ల తూప్రాన్ పట్టణంలోని ఎల్లమ్మ కమాన్ లో భూమన్నగారి వంశస్తులు నిర్మించిన రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వేధ బ్రాహ్మణుల మంత్రోచ్చారణ మధ్య అత్యంత వైభవంగా కనుల పండువగా శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహర్షి కల్యాణంను బ్రహ్మశ్రీ సోమయాజులు రవీంద్ర శర్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. అనంతరం మహిళా భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే అమ్మ వారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనంపల్లి హన్మంతరావు తోపాటు మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మాజీ ఎంపిపి నక్కా ప్రభాకర్ గౌడ్, చిట్కుల మహిపాల్ రెడ్డి, నేత మహేందర్ రెడ్డి, కుమ్మరి రఘుపతి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శశిభూషణ్ రెడ్డి, వెంగలి సత్యనారాయణ, గౌతమ్ గౌడ్, ఫ్యాక్స్ చైర్మన్ మెట్టు బాలకృష్ణ రెడ్డి, చెట్ల గౌరారం శ్రీహరి గౌడ్, కొక్కొండ కాశి రెడ్డి, ఘనపూర్ వెంకటేష్ యాదవ్, బాబినాయుడు,గడ్డం బూమయ్య,విఠల్, పోతరాజు ధన్ రాజు, బియానీ తిరుపతి రెడ్డి,వెంకటేష్ యదవ్ మనోహరాబాద్ జావేద్ భాయ్, హజర్ భాయ్, సమీర్ భాయ్, రేణుకా ఎల్లమ్మ దేవాలయ ధర్మకర్తలు భూమన్నగారి నందంగౌడ్, శ్రీకాంత్ గౌడ్, సహదేవ్ గౌడ్, జానకిరామ్ గౌడ్, సాయి గౌడ్, శంకర్ గౌడ్ తోపాటు భారీ ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking