అర్హులైన నిరుపేదలందరికీ నీడ కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం అహ్మద్గూడలో డబుల్ బెడ్రూమ్ల కేటాయింపు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి (ప్రజాబలం) సెప్టెంబర్ 2:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కల నెరవేర్చాలనే మంచి ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్లను నిర్మించి అర్హులైన నిరుపేదలందరికీ నీడ కల్పించడం జరుగుతుందని ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి ఆలోచన ధోరణితో వీటిని పారదర్శకంగా కేటాయిస్తున్నారని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న అహ్మద్గూడలో శనివారం ముషీరాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల సంబంధించి నియోజకవర్గానికి 500 మంది అర్హులైన లబ్ధిదారులకు 4,428 ఇళ్ళకు గాను 1,500 కి రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి, ముషీరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల లబ్ధిదారులకు 500 చొప్పున 1500 మందికి అలాట్మెంట్ సర్టిఫికెట్లను సైతం అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కల సాకారం చేయాలనే మంచి ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అన్ని వసతులతో కట్టించి పంపిణీ చేయడం జరుగుతుందని ఇలాంటివి దేశంలో ఎక్కడ కూడా చేపట్టలేదని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ కల నిజమైందని ఈ రోజు ఎంతో గొప్ప రోజు అని అన్నారు. అలాగే అర్హులైన పేదవారికి ఎలాంటి పైరవీలు, తదితరాలు లేకుండా పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను కేటాయించడం జరుగుతుందని దీనికి ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించడం జరిగిందని దీనివల్ల ఎలాంటి పరిస్థితుల్లో కూడా అనర్హులకు ఇళ్ళ కేటాయింపులు జరగకుండా అర్హులకు మాత్రమే ఇళ్ళు వచ్చేలా రూపొందించారని ఇది ఎంతో గొప్ప విషయమని మంత్రి మల్లారెడ్డి వివరించారు. దీనివల్ల పైరవీలు, రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన వారికి ఇళ్ళ కేటాయింపు జరుగుతుందని తెలిపారు. మూడు నియోజకవర్గాల్లో మొదటి విడతలో 1,500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను అందచేయడం జరిగిందని మంత్రి తెలిపారు. దీంతో పాటు అర్హులైన మిగిలిన లబ్ధిదారులకు రెండు, మూడో, నాలుగవ దశల్లో డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం జరుగుతుంని ఇది నిరంతర ప్రక్రియ అని అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్లు అందచేయడం జరుగుతుందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లలో అన్ని రకాల వసతులు, సౌకర్యాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. అర్హులైన వారందరికీ దశల వారీ ఆ డబుల్ బెడ్రూమ్ల పంపిణీ జరుగుతుందని ప్రస్తుతం ఇళ్ళు రాని వారు ఎలాంటి ఆందోళన చెందవద్దని అర్హులకు తప్పకుండా ఇళ్ళు వస్తాయని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ళను కేటాయిస్తామని దేశంలో ఇంత గొప్ప కార్యక్రమం ఎక్కడా లేదన్నారు. పేదలపై ఒక్క పైసా భారం పడకుండా ఖర్చు లేకుండా అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేయడం తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేళ్ళ నుంచి మహిళలకు ఎన్నో రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి పేరు మీదనే అందచేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే మహిళల పేరుపైనే సొంత స్థలం ఉన్న వారికి గృహలక్ష్మీ పథకం కింద రూ.3 లక్షలు అందేసి ఇళ్ళు నిర్మించుకొనేలా చేసిందని తెలిపారు. గృహలక్ష్మీ పథకం కింద అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి కూడా సొంత ఇంటిని నిర్మింపచేయడం జరుగుతుందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ప్రస్తుతం దేశంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోందని ఈ విషయంలో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి ఎంతో ఉందని సమావేశంలో మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి టీహబ్ వంటి ఎన్నో రకాల వాటిని తీసుకువచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని ఈ విషయంలో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో 9 లక్షల మంది హైదరాబాద్లోనే ఉద్యోగాలు చేస్తున్నారని ఇది మంత్రి కేటీఆర్ కృషికి నిదర్శమని ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు గురుకుల పాఠశాలల ద్వారా ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.1.25 లక్షలు వెచ్చిస్తూ ఉన్నత చదువులు చదివిస్తోందని… అలాగే నిరుపేదలకు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్, దేశీ విద్య ద్వారా ప్రభుత్వం వారికి అన్ని రకాలుగా సహకరిస్తూ ఆదరిస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటం ఎంతో అదృష్టమని ఆయన ప్రతి ఒక్కరి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను వేరే రాష్ట్రాలు ఆచరిస్తున్నాయని ఇది ఎంతో గర్వకారణమని ఈ విషయంలో ముఖ్యమంత్రిని అన్ని రాష్ట్రాల వారు ఆదర్శంగా తీసుకుంటున్నారని అన్నారు.
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టే ప్రతి కార్యక్రమం ఎంతో గొప్పదని ఇక్కడ మనం చేపడుతున్న పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం మూడు నియోజకవర్గాలకు నియోజకవర్గానికి 500 మందికి చొప్పున 1,500 మంది అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం జరిగిందని అన్నారు. పేదవారికి సొంతింటి కలను సాకారం చేయడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన ఈ కార్యక్రమం ఒక యజ్ఞంలా ముందుకు సాగుతోందని అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్లు అందేలా చూస్తామని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కేటాయింపులో ఎలాంటి రాజకీయాలు, పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా చేపట్టడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులకు అందుతున్నాయని వారు ప్రస్తుతం ఎంతో ఆనందంగా, సంతృప్తిగా ఉన్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ దయాకర్ రెడ్డి, జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య, దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ప్రణిత గౌడ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు ఆర్డీవో రాజేష్ కుమార్, ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking