జగిత్యాలలో ఘనంగా “పవన్” జన్మదిన వేడుకలు

కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు

పలు సేవా కార్యక్రమాలు

జగిత్యాల, సెప్టెంబర్ 2: జనసేన పార్టీ అద్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు శనివారం జగిత్యాల లో ఘనంగా జరిగాయి. జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ బెక్కం జనార్దన్ సారథ్యంలో జన సైనికులు పవన్ కళ్యాణ్ బర్త్ డే ను స్థానిక గార్డెన్స్ లో కేక్ కట్ చేసి వేడుకను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ ఇష్ట దైవమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తదుపరి టిఆర్ నగర్లోని విశ్వకర్మ వృద్ధాశ్రమములో అక్కడి వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. బిసి బాలుర వసతి గృహంలోని పేద విద్యార్థులకు నోట్ బుక్కులు, పెన్నులను పంపిణీ చేశారు. జగిత్యాల ఆసుపత్రిలో రక్తదాన చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ బర్త్ డే ను పురస్కరించుకొని చెట్లను నాటారు. ఈ సందర్భంగా బెక్కం జనార్దన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అంటేనే సేవా భావమని అందుకే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలన చేపట్టామన్నారు. ప్రతి గడపకు జన సేన పార్టీని చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ఇదే కార్యక్రమాల్లో భాగంగా 50 మంది యువకులు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకులు కాస రాజు, సంఘనబట్ల వినయ్, చీటి ఉదయ్ కుమార్, జగిత్యాల మండలం అధ్యక్షులు బొల్లి రాము, లక్ష్మణ్, జగిత్యాల పట్టణ కమిటీ అధ్యక్షులు చింత సుదీర్, వీర మహిళలు జన సైనికులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking