సింగరేణి సులబ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డి. బ్రహ్మానందం
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 24:
సింగరేణి యాజమాన్యం గత 30 సంవత్సరాలు కింద రామన్ కాలనీ, అంగడి బజార్ ఏరియాలో నిర్మించిన సులబ్ కాంప్లెక్స్ ల ను రైల్వే అధికారులు కూల్చివేస్తామని అక్కడ పనిచేసే సులబ్ వర్కర్స్ ను బెదిరిస్తున్నారని సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డి బ్రహ్మానందం ఉన్నారు. శుక్రవారం సింగరేణి ఎస్సీ.ఈ కి సులం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి భూమిలో నిర్మించిన సులబ్ కాంప్లెక్స్ లను రైల్వే అధికారులు ఈ భూమి మాది అని అంటున్నారని ఆయన తెలిపారు. సింగరేణి అక్రమంగా రైల్వే భూమిలో సులబ్ కాంప్లెక్స్ లను నిర్మించిందని, సులబ్ కాంప్లెక్స్ లను కూల్చివేత ద్వారా రెండు కుటుంబాలు నిరుద్యోగులుగా మారుతున్నారన్నారు. పొట్టకూటి కోసం కటిక దరిద్రంలో మగ్గుతు, సమాజంలో ఎవరు చేయలేని పని చేస్తూ జీవిస్తున్న రెండు కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడే అవకాశాలు ఉన్నాయన్నారు. సింగరేణిలో కొత్తగా ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా లేవు రైల్వే అధికారులు సులబ్ కాంప్లెక్స్ లను కూల్చి వేస్తే ప్రశాంతంగా జీవిస్తున్న సులబ్ వర్కర్స్ కుటుంబాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. కనుక సింగరేణి యాజమాన్యం రైల్వే అధికారులతో చర్చించి సులబ్ కాంప్లెక్స్ లను కూల్చివేయకుండా అడ్డుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సులబ్ వర్కర్స్ యూనియన్( ఐ.ఎఫ్. టి. యూ) రీజియన్ అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్, రీజియన్ ఉపాధ్యక్షులు గజ్జి మల్లేష్, నాయకులు ముత్యాల వెంకటేష్, మేకల, సురేందర్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.