మందమర్రి మున్సిపల్ ఎన్నికలు జరిపించేలా చర్యలు తీసుకోవాలి

 

కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కి ఎన్నికల సాధన కమిటీ వినతి

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 24:

మందమర్రి మున్సిపల్ ఎన్నికల సాధన కమిటీ ఆధ్వర్యంలో మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డిని అదేవిధంగా అదిలాబాద్ ఎంపీ నగేష్ ని కలిసి వినతి పత్రాలు అందజేశారు. మందమర్రి మునిసిపల్ ఎన్నికలు జరిగే విధంగా పాలకవర్గం ఏర్పడే విధంగా చూడాలని చెప్పగా వాళ్లు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల సాధన కమిటీ కన్వీనర్ అందుగుల శ్రీనివాస్, కో – కన్వీనర్స్ మేడిపల్లి సంపత్, దీవి దీక్షితులు, బండారి సూరిబాబు, మాయా రమేష్, కొంగల తిరుపతి రెడ్డి, ఓ రాజశేఖర్, మద్ది శంకర్, సంజీవరావు, ఆర్ వెంకన్న,ఈశ్వర్, ఓ రాయమల్లు, అఖిలేష్ పాండే, మాయ చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking