నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ఈ సమావేశంలో అంజు కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో పూర్తిగా విఫలమైందని రైతులను మోసం చేసిందని రైతన్నలకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని రైతులకు పూర్తిగా రుణమాఫీ అయ్యేంతవరకు రైతుల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉందని ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో రాష్ట్ర ప్రభుత్వ రుణమాఫీ వైఫల్యాలని ఎండగట్టడానికి ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలని తెలుసుకొని గవర్నర్ గారికి కలవడం జరుగుతుందని అన్నారు. కార్యకర్తలందరూ స్థానిక సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని ఈ కార్యక్రమాలని ఐదు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా చేయాలని కోరారు మరియు బిజెపి పార్టీ సంస్థ గతంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించి రాష్ట్రస్థాయిలోనే మొదటి జిల్లాగా తీసుకురావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అలివేలుమంగ జిల్లా కార్యదర్శి కోరిపల్లి శ్రావణ్ రెడ్డి,దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు రాచకొండ సాగర్ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ఒడిశాల అర్జున్,స్టడీ సర్కిల్ రాష్ట్ర కన్వీనర్ కుమ్మరి వెంకటేష్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలేటి లింగారెడ్డి,బిసి రాష్ట్ర నాయకులు ఆకుల కార్తీక్,అసెంబ్లీ కన్వీనర్లు మహేందర్, సుమన్ మరియు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది