ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 20 (ప్రజాబలం( ఖమ్మం జిల్లాలోని ముదిగొండ కేజీబీవీ లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చల్లగొండ. అభినయశ్రీ కరాటే బ్లాక్ బెల్ట్ లో జిల్లా, రాష్ట్ర ,జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 9 వరకు జరిగే అంతర్జాతీయ స్థాయి లో జరిగే కరాటే పోటీలకు నేపాల్ లో పాల్గొనేందుకు అభినయశ్రీ ఎంపిక కావడం జరిగింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన అభినయశ్రీ అటు చదువు ఇటు కరాటే లో ఉత్తమ ప్రతిభ కనపర్చడం అభినందనీయం అని, నేపాల్ లో జరిగే కరాటే పోటీలలో పాల్గొనేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకుంటున్న విషయం తెలుసుకున్న జిల్లా మహిళా ప్రాంగణ అధికారిణి వేల్పుల విజేత వ్యక్తిగతంగా తన వంతు ఆర్థిక సహాయం గా పది వేల రూపాయలు మంగళవారం మహిళా ప్రాంగణంలో అందజేయడం జరిగింది…ఈ సందర్భంగా జిల్లా మహిళా ప్రాంగణ అధికారిణి వేల్పుల విజేత మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అభినయశ్రీ నేపాల్ లో జరిగే కరాటే పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా రాష్ర్ట దేశ ప్రతిష్టను మరింత పెంపొందించే విధంగా పోటీపడి అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు తీసుకురావాలని అకాంక్షించారు అదే విధంగా అభినయశ్రీ కరాటే శిక్షకుడు శ్రీ రామకృష్ణ కృషి నీ అభినందించారు