ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 20: మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం బాలికలకు అవగాహన కార్యక్రమం ఎస్సై హేమ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై హైమ మాట్లాడుతూ…”యుక్త వయసులో ఉన్న బాలికలు.అపరిచిత వ్యక్తులతో స్నేహ సంబంధాలు నెరపరాదని, సోషల్ మీడియాను దుర్వినియోగం చేయరాదని,వ్యక్తిగత జీవితాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా,షీ టీం బృందాన్ని సంప్రదించాలని, పిలుపునిచ్చారు.
షీ టీం ఆధ్వర్యంలో,స్థానిక లక్షెట్టిపేట గురుకుల కళాశాలయందు,పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు సమాజంలో జరుగుతున్న నేరాలపై, యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమంలో భాగంగా,భరోసా స్కీం కింద ఆడపిల్లలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా రక్షణ కల్పిస్తామని, కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం చేస్తామని.. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, షీ టీం సభ్యులు విద్యార్థినులకు తెలియజేశారు.ఈ అవగాహన సదస్సులో, సబ్ ఇన్స్పెక్టర్ తో పాటు షి టీం నలుగురు లోని సభ్యులు పలు అంశాలను తెలియజేశారు. విద్యార్థులు లేవనెత్తిన పలు సందేహాలకు వివరణ ఇచ్చారు.ఈ అవగాహన కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ కే మహేశ్వర రావు,జూనియర్ వైస్ ప్రిన్సిపల్ కే శ్రీలత, ఉపాధ్యాయురాలు శ్రీమతి బేబీ రాణి,శివ ప్రియ, వినయ్ లు పిల్లలతో పాటు పాల్గొన్నారు.
Prev Post