దేశానికి రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

ప్రజాబలం ప్రతినిధినిర్మల్ జిల్లా..

మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు నివాసంలో రాజీవ్ గాంధీ 80వ జయంతి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్‌ గాంధీనేనని అన్నారు. 18 ఏండ్లకే యువకులకు ఓటు హక్కును కల్పించారని తెలిపారు.దేశ యువతకి రాజీవ్ గాంధీ స్ఫూర్తి అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు గారి ఆదేశాల మేరకు డీసీసీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాదెడపు చిన్ను, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు ఎంబడి రాజేశ్వర్,మాజీ జెడ్పిటీసి సభ్యులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి,
ఎండి కిజర్.ఎండి రఫీ.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి యువజన కాంగ్రెస్,ఎన్ఎస్ యుఐ నాయకులు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking