మృతుల కుటుంబాలకు అండగా మంత్రి పువ్వాడ

 

పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థికసహయం అందజేసిన పీఏ రవికిరణ్

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 26 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని రాంక్యతండాలో ఇటీవల మృతి చెందిన బాణోత్ బుజ్జి మరియు షేక్ కమ్రోన్ భీ కుటుంబాలను పరామర్శించి పువ్వాడ ఫౌండేషన్ ద్వారా కుటుంబానికి 5 వేలు రూపాయల చొప్పున ఆర్థికసహయాన్ని మంత్రి పువ్వాడ పీఏ చిరుమామిళ్ల రవికిరణ్ అందజేశారు.మృతుల కుటుంబాలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అండగా ఉంటారు అని పేర్కొన్నారు.అనంతరం సి డి పి నిధుల ద్వారా మంజూరైన సిసి రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రియాంక,మండల పార్టీ అధ్యక్షులు వీరునాయక్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అప్జల్,సర్పంచ్లు హరిప్రసాద్, మేంటెం రామారావు,నాయకులు తార చంద్,లచ్చు,శ్రీను పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking