ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 26 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాయ పాలెం లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. సెక్టార్ అధికారి కేంద్రాన్ని సందర్శించింది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఆధార్ ట్యాగింగ్ ప్రక్రియ ఎంతవరకు జరిగింది, నమోదు, మార్పులు చేర్పులు కు సంబంధించి ఎన్ని ఫారాలు వచ్చింది, 18-19 సంవత్సరాల వయస్సు వారు ఎంతమంది ఉన్నది, ఎలక్టోరల్ లో ఎంతమంది ఉన్నది, వేరే గ్రామాల ఓటర్లు ఎవరైనా నమోదై ఉన్నారా తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిఎల్ఓ రిజిస్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన వారందరూ, 1అక్టోబర్, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండబోయే పౌరులకు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా కృషి చేయాలని అన్నారు. జిల్లాలోని జూనియర్, డిగ్రీ కళాశాలలో, వివిధ వృత్తి నైపుణ్య విద్యార్థులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రధానోపాధ్యాయుల సహకారంతో చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఓటరు జాబితా పకడ్బందీగా ఉండేలా చూడాలని, డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను ఆగస్టు 21న విడుదల చేశామని, ఆగస్టు 26 , ఆగస్టు 27, సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 3 తేదీలలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం శిబిరాన్ని ఏర్పాటు చేసి నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో అభ్యంతరాల స్వీకరణ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఓటరు జాబితాలో మరణించిన వ్యక్తుల వివరాలు ఉంటే వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 19 లోపు తెలియజేయాలని, అక్టోబర్ 1 2023 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ కోసం దరఖాస్తు చేసుకోవాలని, పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటర్ నమోదు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా బిఎల్ఓ లు ఎం. షాలిని, కె. కవిత తదితరులు ఉన్నారు.