10 వ వార్డును అభివృద్ధి పరచాలని మున్సిపల్ చైర్మన్ కమిషనర్ కు వినతి పత్రం అందజేత.

 

తూప్రాన్, మార్చి 22.ప్రాజబలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధి 10వ వార్డును అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని గతంలో పదవ వార్డు నాయకుల పెత్తనంతో అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడిందని ,
తూప్రాన్ పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని పదవ వార్డు గ్రామ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు నూతనంగా ఎన్నికైన చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ లను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపి
తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ, కమిషనర్ ఖాజా మొయినావుద్దీన్ కు 10 వ. వార్డు ప్రజలు వినతిపత్రం అందజేసినారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 రూపాయల నల్లా బిల్లు మాఫీ లేదా రద్దు పై పరిశీలన చేయాలని బ్రాహ్మణపల్లి వెంకటాపూర్ ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులో మిషనరీని ఏర్పాటు చేయాలని, రాత్రుల్లో చెత్తను తగలబెట్టకుండా చూడాలని మరియు కోతుల బెడద తీవ్రంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని కోతులపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పిచ్చి కుక్కలు పశువులపై పడి ప్రాణాలు తీస్తున్నాయని వాటిని నివారించాలని ముఖ్యంగా చెరువులో బతుకమ్మ ఘాటును నిర్మించాలని, యువకులకు క్రీడా ప్రాంగణం, ఓపెన్ జిమ్, వ్యవసాయ పొలాలకు నక్ష త్రోవలను ఏర్పాటు చేయాలని వీటన్నిటికీ నిధులను సమకూర్చాలని పదవ వార్డు ను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచాలని తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ కు 10 వార్డు ప్రజలు వినతి పత్రంను అందజేసినారు. ఈ కార్యక్రమంలో చింత రాజు రెడ్డి , గౌతమ్ , సత్యనారాయణ, రవి యాదగిరి, ఎల్లారెడ్డి, రవి బిక్షపతి, మహేందర్ రెడ్డి, రమేష్, తిరుపతి, సంజయ్, నిశాంత్, అనిల్, గోవర్ధన్ రెడ్డి, బిక్షపతి ముఖ్య కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ‌.

Leave A Reply

Your email address will not be published.

Breaking