జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా కుక్కల నరేష్ (నాగరాజు)

ఖమ్మం ప్రతినిధి మార్చి 22 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా అద్యక్షులు యడ్లపల్లి సంతోష్ కుక్కల నరేష్ (నాగరాజు)ను మండల యూత్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ నుండి జిల్లా ఉపాధ్యక్షుడిగా ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా కుక్కల నరేష్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా యూత్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను అని మండల కమిటీలో అవకాశం వస్తుంది అని ఆశించిన అనివార్య కారణాల వల్ల ఆ పదవి రాలేదు అని అన్నారు నా కష్టానికి తగిన గుర్తింపు ఇస్తూ ఈ రోజు జిల్లా ఉపాధ్యక్షుడిగా ప్రమోట్ చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. గత 10 సంవత్సరాలుగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్ తో కలిసి అనేక పోరాటాల్లో పాల్గొన్న అని అన్నారు పైనంపల్లి గ్రామ వార్డ్ మెంబర్ గా కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నాకు ఇదో పెద్ద అవకాశం అని అన్నారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంటూ యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తా అని అన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking